• నీట్ లీకేజ్‌పై మీ సమాధానం ఏంటీ?
• మీడియా సమావేశంలో కేంద్ర సర్కారుపై వజ్రేష్ యాదవ్ ధ్వజం
నవతెలంగాణ-బోడుప్పల్: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. విద్యా రంగంలో నాణ్యత పెంపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.ప్రభుత్వ బడులను ఆధునికీకరించేందుకు, విద్యార్థులకు అత్యుత్తమ వసతులు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతూ, అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య విద్యా అసమానతలను తొలగించడం, ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వజ్రేష్ యాదవ్ స్పష్టం చేశారు.అయితే నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో విద్యార్థుల మనోధైర్యం దెబ్బతిన్నదని, భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నదని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు న్యాయం చేసేలా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
• సర్ పై అప్రమత్తంగా ఉండాలి శ్రేణులకు పిలుపు..
స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (సర్) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ బీఎల్ఎలకు పిలుపునిచ్చారు.సర్వే చేస్తున్న సమయంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ అధికారితో పాటే ఉండాలని సూచించారు. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి రాజ్యంగం కన్పించిన హక్కని దానిని కాల రసే అధికారం ఎవరికి లేదని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా అర్టీఏ మెంబెర్ జైపాల్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఏనుగు జలంధర్ రెడ్డి, కుకట్ పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేరీ సతీష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పు రామ రావు,మాజీ పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఘట్కేసర్ మండల్ అధ్యక్షులు కర్రే రాజేష్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.


