Wednesday, August 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులాలో అత్యవసర పరిస్థితి

వెనిజులాలో అత్యవసర పరిస్థితి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజులా తాత్కాలిక అధ్యక్ష‍ురాలు రోడ్రిగ్జ్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వెనిజులాలో గురువారం ఉదయం వరుసగా రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. వరుస భూకంపాల ధాటికి రాజధాని కారకాస్‌లో పలు భవనాలు కూలిపోయాయి. సుమారు 32మంది మరణించగా, 700మంది గాయపడినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. కారకాస్‌లోని సైమన్‌ బొలీవర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసినట్లు ప్రకటించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం.
వెనిజులాలో భారీ భూకంపాలు భారీ సంఖ్యలో ప్రాణనష్టాన్ని కలిగించాయని అమెరికా అధ్యక్ష‍ుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ఆదేశానికి సాయం అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. అర్జెంటీనా, చిలీ సహా పలు దక్ష‍ిణ అమెరికా దేశాలు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ వ్యవస్థాపకుడు జోస్‌ ఆండ్రూస్‌ 1మిలియన్‌ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. వెనిజులాలో సహాయక చర్యల కోసం ఈ విరాళాన్ని ప్రకటిస్తున్నట్లు ఆయన ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -