- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని చిన్న ఎక్లారా గ్రామంలో వీధిలైట్లు లేక గ్రామస్థులు ఇబ్బందిపడుతున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మాధవరావు స్పందించారు. అంతేకాదు దగ్గరుండి వీధిలైట్లు ఏర్పాటు ఏశారు. అంతేకాదు ఓ వ్యక్తి వీధిలైటు బిగించడం కోసం నిచ్చెనపై ఉంటే.. అతను పడిపోకుండా నిచ్చెనను జాగ్రత్తగా పట్టుకున్నారు. దీంతో గ్రామం కోసం పనిచేస్తున్న సర్పంచ్ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



