- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జార్ఖండ్‌లోని రామ్‌ఘడ్ జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



