సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు
వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో వీబీ గ్రామ్‌జీ పథకాన్ని ప్రతిపా దించడాన్ని వ్యతిరేకిస్తూ జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపాలని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపుని చ్చాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఆయా సంఘాల రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, తీగల సాగర్, ఆర్ వెంకట్రాములు పోస్టర్‌ను అవిష్కరించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధిని దెబ్బ తీసేందుకే వీబీ గ్రామ్‌జీని తీసుకొచ్చిం దని విమర్శించారు. దీనిపై కేంద్ర సంఘాల భాగంగా రాష్ట్రంలోనూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ కార్మికులు, పేద రైతులు, మహిళలు, దళితులు, ఆదివాసులు, ఇతర బలహీన వర్గాలకు ఉపాధి భద్రత, ఆదాయ మద్దతును అందిం చేందుకే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. దాన్ని రద్దు చేయటం వల్ల లక్షలాది గ్రామీణ కుటుంబాల జీవనోపాధి పైనా, మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నరేగా స్థానంలో ప్రతిపాదిత వీజీ గ్రామ్‌జీని తీసుకురావటం పెద్ద కుట్రేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు గ్రామీణ కార్మి కుల, పేదల హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు.
పాత చట్టంపై దాడి చేయట మంటే.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేయటమేనని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రతిఘటించడానికి, గ్రామీణ భారతదేశ హక్కులను, జీవనోపాధులను కాపాడుకోవడా నికి రైతులు, వ్యవసాయ కార్మికుల ఐక్యత అత్యంత అవసరమని పేర్కొన్నారు. నరేగాను బలోపేతం చేయాలి.. దానికి బడ్జెట్ కేటాయింపులను పెంచాలి.. అర్హులైన అన్ని కుటుంబాలకు ఉపాధికి హామీ ఇవ్వాలి.. వేతనాలను సకాలంలో చెల్లించాలి.. ఉపాధిహామీ వ్యవస్థను బలహీన పరిచే ఎలాంటి చర్యలనైనా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్బాబు, పైళ్ళ ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.


