Friday, June 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం27న భద్రాచలం ఆలయ పనులకు శ్రీకారం

27న భద్రాచలం ఆలయ పనులకు శ్రీకారం

- Advertisement -

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

​భద్రాచలం రామాలయం అభివృద్ధి పనులకు ఈ నెల 27న శ్రీకారం చుడుతున్నామని శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌‌లోని సచివాలయంలో దేవాదాయశాఖ, భద్రాచలం ఆలయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయ వైభవం, ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా, సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాబోయే రెండు వందల సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. ఆలయ పునరుద్దరణ పనులకు ప్రభుత్వం రూ.351ను మంజూరు చేసిందని తెలిపారు. వచ్చే శ్రీరామ నవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -