రైజర్స్‌పై ఈ చాంపియన్స్ గెలుపు
నవతెలంగాణ-హైదరాబాద్
టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జోరు కొనసాగుతుంది. లీగ్ దశలో వరుసగా రెండో విజయం సాధించిన ఈ చాంపియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. టీజీ20లో గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్‌పై హైదరాబాద్ ఈ చాంపియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 196 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (99, 45 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. అశ్విన్ (30), యశ్‌వీర్ గౌడ్ (30 నాటౌట్), గణేశ్ (25 నాటౌట్) రాణించారు. మరో 12 బంతులు ఉండగానే ఈ చాంపియన్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. అవనీశ్ రావు (53), ఆదిత్య (58), తనయ్ త్యాగరాజన్ (31), అరోన్ జార్జ్ (35) రాణించారు.
అభిరథ్ అదరహో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



