- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆన్‌లైన్ ట్రోలింగ్ నుంచి రక్షించాలని ఐసీసీకి మహిళా క్రికెటర్లు విజ్ఞప్తి చేశారు. ఐసీసీ ప్లేయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో 100కిపైగా మహిళా క్రికెటర్లు పేరు నమోదు చేసుకున్నారు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా క్రికెటర్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను అరికట్టేందుకు ఏఐ కంపెనీ ఫ్రీడమ్2హియర్‌తో కలిసి ఐసీసీ పని చేస్తోంది. ఇది ఇప్పటికే ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేలా ఉన్న 60,000లకు పైగా పోస్టులను తొలగించింది. ఇందుకోసం 2,50,000 కామెంట్లను సమీక్షించింది.
- Advertisement -



