Friday, June 26, 2026
E-PAPER
Homeజాతీయంఅయోధ్య విరాళాలు..ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాజీనామా

అయోధ్య విరాళాలు..ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌‌లోని అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలపై అయోధ్యలోని రామ జన్మభూమి పోలీసు స్టేషన్‌‌లో ఎఫ్‌ఐఆర్‌‌ నమోదైన విషయం తెలిసిందే. 8 మందిపై శ్రీ రామ జర్మభూమి ట్రస్టు సభ్యులు కృష్ణ మోహన్‌ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత(బిఎన్‌ఎస్‌) ‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ మందిర ట్రస్టులోని ఒక ఉన్నతాధికారి, ఒక ట్రస్టీ నైతిక కారణాలతో రాజీనామా చేశారు. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చంపత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనతో పాటు మరో కీలక వ్యక్తి అనిల్ మిశ్రా రాజీనామాలను సమర్పించారని ఒక అధికారి ధృవీకరించారు.

మరోవైపు ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఈ వ్యవహారంపై రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ‌నియమించగా..అది కంటి తుడుపు చర్య అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణంపై విచారణ కోసం సిట్ ఏర్పాటు ఒక కంటితుడుపు చర్య అని, దానికి చట్టబద్ధత లేదని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ సిట్‌ అసలు లక్ష్యం, ఉద్దేశ్యం సత్యాన్ని వెలికితీయడం కంటే ఈ కేసులో చిక్కుకున్న పలుకుబడి ఉన్న వ్యక్తులను రక్షించడమేనని తెలిపారు.

అయోధ్యలోని రామమందిరం విరాళాల గల్లంతు కుంభకోణంపై నిష్పక్షపాతంగా నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరగాలని, ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ ‌దాఖలైంది. ఈ పిటిషన్‌‌ను ఈ నెల 29న ప్రస్తావించాల్సిందిగా సుప్రీం కోర్టు గురువారం సదరు పిటిసనర్‌‌కు సూచించింది. జస్టిస్‌ ‌బి.వి.నాగరత్న, జస్టిస్‌‌ జోమాల్యా బాగ్చిలతో కూడిన బెంచ్‌ ‌ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ దీనిపై అత్యవసర విచారణ జరగాలని పిటిషనర్లు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -