Wednesday, August 5, 2026
E-PAPER
Homeజాతీయంయూపీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్‌ అరెస్టు

యూపీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్‌ అరెస్టు

- Advertisement -

నవతెలంంగాణ-హైరదాబాద్: ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని భద్రౌలి శాఖకు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు అరెస్టు చేశారు. సోలార్ ప్యానెల్ రుణ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించేందుకు, ఒక్కో దరఖాస్తుకు రూ. 7,000 చొప్పున బ్యాంక్ మేనేజర్‌ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ. 52,000 లంచం తీసుకునేందుకు అంగీకరించినట్లు కూడా తెలిసింది. ముందుగా ఫిర్యాదుదారు నుండి రూ. 30,000 లంచం తీసుకుంటుండగా CBI అధికారులు వల పన్ని ఆ మేనేజర్‌ను రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకుని గురువారం అరెస్టు చేశారు. జూన్ 25న అరెస్టు అయిన నిందితుడిని జూన్ 26న ఘజియాబాద్‌లోని సంబంధిత కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -