మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీవ వైవిధ్య పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. జీవ వైవిధ్య పరిరక్షణ-యువత సాధికారతే లక్ష్యంగా హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యువ జీవ వైవిధ్య సదస్సు-2026 ముగింపు వేడుకల్లో సోమవారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలో పర్యావరణ అవగాహన పెంపొందించడంతో పాటు ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన ఆవిష్కరణలు, పరిశోధనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడే దిశగా యువత ముందుకు రావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కేంద్రం సహ-స్థాపకులు, సీఈఓ సృజన్ పాల్ సింగ్, అలాగే తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి సభ్య కార్యదర్శి కాళీ చరణ్ పాల్గొన్నారు.



