- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్‌పై అమెరికా మిలిటరీ మళ్లీ దాడులు ప్రారంభించింది. తీర ప్రాంతాలతో పాటు ఇరాన్‌లోని కీలక డ్రోన్, క్షిపణి నిల్వ కేంద్రాలు, కోస్టల్ రాడార్ సైట్‌లపై భీకరమైన దాడులు జరిపి ధ్వంసం చేసిందని US సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇటీవల రెండు దేశాల మధ్యా అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత మళ్లీ ఈ స్థాయిలో దాడులు జరగడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. నిన్న సింగపూర్ షిప్‌పై ఇరాన్ దాడి చేయడాన్ని ట్రంప్ ఖండించిన కాసేపటికే ఈ అటాక్ జరగడం గమనార్హం.
- Advertisement -



