- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల అమాంతం పెరిగిన టమాటా ధరలు నేడు భారీగా దిగి వచ్చాయి. గత కొద్ది రోజులుగా కిలో టమాటా ధర రూ.50-70 పలకగా.. ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ రూ.20 నుంచి రూ.25కే అమ్ముతున్నారు. వంకాయ రూ.25, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.50 వరకు పలుకుతున్నాయి. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా రేట్లు మండిపోతున్నాయి. కేజీ రేటు సెంచరీకి చేరువలో ఉండటంతో కేంద్రం రూ.35-45కు సబ్సిడీలో విక్రయించాలని ప్రణాళికలు రచిస్తోంది.
- Advertisement -



