Saturday, June 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలి

ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

•  కాంగ్రెస్ శ్రేణులకు ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపు
నవతెలంగాణ -పెద్దవంగర 
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.

పాలకుర్తి నియోజకవర్గంలోని బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి సంబంధిత బీఎల్‌ఓ లతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల నమోదు, సవరణ, ధృవీకరణ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే పునాది అని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అర్హత కలిగిన ఓటరు పేరు జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, జిల్లా నాయకులు రవీందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ నాయక్, ఈదురు బాషా, దాసరి శ్రీనివాస్, దుంపల కుమారస్వామి, ఉపసర్పంచ్ వినోద్, లింగమూర్తి, సంపత్, నరేష్, ఉపేందర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -