Saturday, June 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ భవనం ప్రారంభం

మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ భవనం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీనగర్‌లో రూ.20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల–కళాశాల (బాలికల) భవనాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబైదుల్లా కొత్వాల్ శనివారం ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతన భవనంలోని తరగతి గదులు, వసతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించిన మంత్రులు, విద్యార్థినులకు అత్యుత్తమ విద్యా వాతావరణం కల్పించేలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ను శాలువాతో సత్కరించారు.

అనంతరం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబైదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ.. మైనార్టీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాణ్యమైన విద్యతో పాటు సురక్షిత వసతి, ఆధునిక మౌలిక వసతులు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించే అవకాశాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు, మహిళా మైనార్టీ యోజన కింద రూ.50 వేల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద 20 కుట్టు మిషన్ యూనిట్లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని “రేవంతన్న సహారా ఫర్ ది మిస్కిన్స్” పథకం కింద మోపెడ్ వాహనాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీ జి.నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి బి. షఫీఉల్లా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, టీజీఎంఆర్ఈఐఎస్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -