Saturday, June 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలో ని ఇందిరమ్మ గృహ నిర్మాణాలను జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం గృహ నిర్మా ణాలు చేపట్టాలని సూచించారు. సన్మానం లో కొలతలలో ఎక్కువ తక్కువ అయిన బిల్లులు మంజూరు కావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని చిన్నపాటి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించి నిర్మాణాలను సులువుగా నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గృహ నిర్మాణాలను  చేపడుతున్న లబ్ధిదారులు వారి ఖాతాలో ని మూడు విడుతలుగ  డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు నిర్మాణ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -