Sunday, June 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -

నవతలెలంగాణ – హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో శనివారం బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో, అతివేగంతో దూసుకొచ్చిన డీసీఎం వాహనం అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని సుమారు 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, డీసీఎం డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ సీఐ మధుసూదన్, పేట్ బషీరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -