నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోడూరు తీరంలో తీవ్ర విషాదం నెలకొంది. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు అలల ఉధృతికి కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా, ఒక బాలికను స్థానికులు రక్షించారు. గల్లంతైన మరో బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరుకు చెందిన ఒక కుటుంబం నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ కోసం విచ్చేసింది. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలో భాగంగా కోడూరు బీచ్‌కు వెళ్లారు. అక్కడ సముద్రంలో చిన్నారులు స్నానం చేస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన పెద్ద అల ముగ్గురినీ లోపలికి లాక్కెళ్లింది. దీనిని గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి ఒక బాలికను సురక్షితంగా తీరానికి చేర్చారు. అయితే, సుఫియాన్ (4) అనే బాలుడు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన మరో బాలిక కోసం గజ ఈతగాళ్ల బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
సముద్రంలో ముగ్గురు చిన్నారులు గల్లంతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



