Sunday, June 28, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీవైద్యో నారాయణో హరి

వైద్యో నారాయణో హరి

- Advertisement -

భారతదేశంలో జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకోవడం అనేది భారతీయ వైద్యుల, ఆసుపత్రుల, పలు వైద్య అనుబంధ విధానాల ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అంతేకాకుండా సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచే క్రమంలో వైద్యుల కషి, త్యాగాలను గుర్తు చేసుకుంటూ వైద్యులకు గౌరవంగా కతజ్ఞతలు తెలుపుకునేందుకు జాతీయ వైద్యుల దినం దోహదపడుతుంది.

డాక్టర్‌ బిధాన్‌ చంద్ర రారు జయంతి, వర్ధంతి రోజున (ఆయన 1882 జూలై 1న జన్మించి 1962 జూలై 1వ తేదీన మరణించారు) నిర్వహిస్తుంటారు. భారతీయ వైద్య సంఘం (IMA)1991 నుండి ఈ వైద్యుల దినోత్సవం జరుపుతూ వస్తున్నది. డాక్టర్‌ బిధాన్‌ చంద్ర రారు (BC )ఒక వైద్యుడు మాత్రమే కాకుండా స్వాతంత్ర సమరయోధుడు. అంతేకాకుండా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి ఆయన రెండవ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1962లో భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఆయనను వరించింది. మనలాగే మార్చి 30 వ తేదీన అమెరికాలో జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. శస్త్ర చికిత్సలో అనిస్తిషియను ప్రవేశపెట్టిన ఒక వైద్యుడి జ్ఞాపకంగా వాళ్లు వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నారు.

గణనీయమైన మార్పులు
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో వస్తున్న శాస్త్రీయ మార్పులు వైద్య రంగంలో కూడా వస్తున్నాయి. అభివద్ధి సాధిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల సహాయంతో వైద్యంలో అనేక మార్పులను, సంస్కరణలను మనం చూస్తున్నాం. ముఖ్యంగా రోగనిర్ధారణ విషయంలో వైద్యశాస్త్ర అభివద్ధి కొనియాడదగింది. కేవలం రోగి ఇచ్చే సమాచారం, వైద్యుని అనుభవపూర్వకమైన అవగాహనతో చేసే రోగనిర్ధారణ కాలం నుండి ఎక్స్‌ రే లు, అల్ట్రా సౌండ్లు, ఎమ్‌ఆర్‌ఐలు, సిటి స్కాన్లు వంటి ఆధునిక వైద్య పరికారాలతో పాటుగా, పాథాలజీ రంగంలో వచ్చిన పరిశోధనాత్మక అభివద్ధి రోగనిర్ధారణను సులభతరం చేసి, రోగికి సరైన వైద్యం అందించేందుకు వైద్యుల, ఆసుపత్రుల ప్రామాణికతను వేగవంతంగా పెంచేశాయి. దానికి తోడు వేగవంతమైన సమాచార సాంకేతిక రంగాలలో సాధించిన మార్పుల వల్ల అంటే డిజిటలైజేషన్‌, టెలి మెడిసిన్‌ లాంటి టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వైద్యుల అనుభవాలను, నైపుణ్యాలను పంచుకోవడానికి, మేధో వైద్య చర్చలను సాగించడానికి తోడ్పాటును ఇచ్చింది. దీనివల్ల వైద్య నైపుణ్యాలు మారుమూల ప్రాంతాలకు విస్తరించి ప్రజలకు మేలైన వైద్యాన్ని అందించడానికి ఉపయోగపడింది. వివిధ దేశాల్లో నిపుణుల అధ్యయనాలు, పరిశోధనాలు వివిధ దేశాలు పంచుకోవడం వల్ల వైద్య విద్యలో సైతం మునుపటి కంటే గణనీయమైన మార్పులను మనం చూస్తున్నాం.

ప్రైవేటురంగం ప్రభావం
గడచిన వంద సంవత్సరాలతో పోలిస్తే భారతదేశంలో వైద్యశాస్త్రం ప్రపంచ దేశాలతో కలిసి పలు అభివద్ధి నమూనాలను సొంతం చేసుకున్న మాట నిజం. ఫార్మా రంగం, డయాగ్నోసిస్‌ రంగంతో పాటుగా వివిధ స్పెషలైజేషన్‌లు విస్తరించిన మాట వాస్తవం. అయితే కొన్ని యూరప్‌ దేశాలతో పోల్చినప్పుడు వాటికి భిన్నంగా భారతదేశంలో వైద్యం, ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగమే తన పాత్రను పోషిస్తున్నది. ప్రభుత్వ రంగాల కంటే ప్రైవేట్‌ రంగాలే ఎక్కువ భాగం వైద్య రంగాన్ని ఆక్రమించి ఉన్నాయి. ప్రైవేటు వైద్యరంగం విస్తతమవుతున్న సందర్భంలో వైద్యుల, రోగుల మధ్య ఉండవలసిన కనీస సంబంధాలు పతనమయ్యాయి. వైద్యం పూర్తిగా వ్యాపారాత్మక ధోరణిని సంతరించుకున్నది. దానితో ఆర్థికపరమైన సంబంధాలే కానీ వైద్యుల రోగుల మధ్య ఉండవలసిన కనీస సంబంధాలు, ప్రేమపూర్వక బంధాలకు విఘాతం ఏర్పడింది. ఈ మానవీయ సంబంధం పతనమయ్యి కేవలం పరస్పర సర్దుబాటులతో మాత్రమే వైద్యుడు, రోగి మధ్య అస్పష్ట అంగీకారం కొనసాగుతున్నది.

వైద్యుల పట్ల వ్యతిరేకత
‘తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న సమాజానికి చక్కగా సర్దుకుపోవడం కొలమానం కాదు’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి. పెరిగిపోతున్న వైద్య వ్యాపారంలో కత్రిమమైన, కేవలం ఆర్థిక లావాదేవీలకు మాత్రమే పరిమితమైన వైద్యుల వ్యవహార శైలి రోగులకు, వారి కుటుంబాలకు వైద్యుల పట్ల వ్యతిరేక ధోరణి పెంపొందించేలా తయారైంది. డాక్టర్‌ – రోగి మధ్య ఉన్న సంబంధాలు క్షీణించి వైద్యులు దోపిడీ దారులుగా, ధన దాహంతో వెంపర్లాడే వారిగా, రోగనిర్ధారణ పరీక్షల పేరుతో డబ్బులు గుంజే వారిగా, మందుల కంపెనీలకు వ్యాపారం చేసి పెట్టే కమీషన్లు పొందే దురాశాపరులుగా ప్రజల దష్టిలో ముద్ర పడిపోయారు. అక్కడక్కడ మంచి వైద్యులు ఉన్నా వ్యాపారం చేసే వైద్యుల ముందు వారి మంచితనం వెలవెల పోతున్నది. వైద్యుల పట్ల ప్రజల్లో పెరిగిపోయిన ఈ వ్యతిరేకత, అసహనం అప్పుడప్పుడు వైద్యులపై దాడులకు, ఆసుపత్రుల విధ్వంసానికి దారితీస్తుంది. వైద్యులు పూర్తిగా అనైతికంగా మారిపోయారనే అభిప్రాయం ఇటీవల కాలంలో మరింతగా బలపడుతున్నది. ఆమధ్య స్వయంగా గవర్నర్‌ స్థాయిలో ఉన్న వారే వైద్యుల అనైతికత పట్ల, ప్రజల నుండి అనవసరంగా డబ్బులు లాగే విధానం పట్ల చేసిన వాఖ్య సమాజంలో ఒక పెద్ద చర్చకు దారితీసింది.

లోపం ఎక్కడున్నది?
లోతుల్లోకి వెళితే.. సంపాదనే ప్రధాన ధ్యేయంగా మారిన సమాజం ఒక కారణం అయితే, కార్పొరేట్‌ సంస్థలు వైద్య వ్యాపారంలోకి వచ్చి పెట్టుబడులు – లాభాలు అనే సూత్రాన్ని మాత్రమే నమ్ముకుంటున్నారు. దాంతోపాటుగా కోట్ల రూపాయలు కుమ్మరించి చదువుకునే వైద్య విద్య మరొక కారణం. ఎప్పుడైతే కోట్ల రూపాయలు తీసుకొని వైద్య విద్యను బోధించడం మొదలైందో అక్కడి నుండే వైద్యం వ్యాపారంగా మారడం మొదలయ్యింది. ఒకరకంగా ప్రభుత్వమే వైద్యులను వ్యాపారస్తులుగా మార్చి సమాజంపైకి ఉసిగొలుపుతున్నది. అక్కడే వ్యాపార వస్తువుగా మారిన వైద్యుడు వ్యాపారస్తుడిగా కాకుండా ప్రజలకు సేవ చేసే మానవతా మూర్తిగా తయారవుతాడని ఆశించడం అత్యాశ అవుతున్నది. గత 20, 30 ఏండ్ల కాలం నుండి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసే ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు పుట్టుక రావడంతో ఈ వైద్య విద్యా విధానం మానవతా విలువలుగల, రోగులపట్ల సానుభూతితో ఉండే వైద్యులు తయారు కావడానికి అనుకూలంగా లేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత విద్యార్థులుగానీ, వాళ్ళ తల్లిదండ్రులుగానీ పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు సంపాదించాలని అనుకుంటారు. ఇక వైద్యో నారాయణో హరి లాంటి మాటలు సత్య దూరమైనవి. అవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ నిజానికి అలాంటి పదాలకు కాలం చెల్లి చాలాకాలం అయ్యింది.

గ్రామీణ వైద్యంలో తీవ్ర సవాళ్లు
భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఒక వైవిధ్యమైనది. కేవలం ప్రభుత్వమే ఆరోగ్య సంరక్షణను నిర్వహించే కొన్ని దేశాల్లాగా కాకుండా ప్రభుత్వ – ప్రైవేటు రంగాల నెట్‌వర్క్‌తో 140 కోట్ల జనాభాకు విస్తతమైన వైద్య సేవలు అందించడంలో ఈ రెండింటి పాత్ర ఉన్నది. ప్రైవేటు రంగంలో అభివద్ధి చెందిన టెక్నాలజీతో పెట్టుబడులు పెట్టి ముందుకు సాగుతుంటే ప్రభుత్వం మాత్రం నిపుణుల కొరత, నిధుల కొరతతో గ్రామీణ వైద్యాన్ని అందించడంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఆరోగ్యశ్రీ వంటి పథకాలు, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి పథకాలు కొంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నా ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఇంకా గణనీయమైన మార్పులను చేయవలసిన అవసరాన్ని భారతీయ గ్రామీణ వైద్య సదుపాయాల పరిస్థితి నొక్కి చెబుతున్నది.

క్షీణిస్తున్న ప్రజారోగ్యం
భారత్‌ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత డెబ్బైల వరకు ప్రజా ఆరోగ్యంపైన ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఆరోగ్య సంరక్షణా సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రమైన కషి జరిగింది. అప్పట్లో బోర్‌ కమిటీ సూచించిన సలహాలు, సిఫార్సులు ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వెన్నుదన్నుగా నిలిచాయి. డెబ్బైల చివరినాటికి తలెత్తిన ప్రపంచ ఆర్థిక మాంద్యం అన్ని రంగాలతో పాటుగా ఆరోగ్య రంగంపై కూడా పడింది. ఐఎంఎఫ్‌ లాంటి ప్రపంచ బ్యాంకుల నుండి లభించిన రుణాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ఊరటనిచ్చినప్పటికీ ప్రైవేటు రంగం పుంజుకున్న వేగాన్ని అందుకోవడంలో ప్రభుత్వాలు వెనకబడ్డాయి. ప్రభుత్వం అందించే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విషయంలోనూ, ప్రజారోగ్యం విషయంలోనూ ఆశించినంత పరిస్థితులు కనిపించక పోగా మరింతగా క్షీణిస్తూ పోయింది. అదే సమయంలో ప్రజారోగ్యంలో భారీ వాటాను చేజిక్కించుకోవడంలో ప్రైవేటు పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు పూర్తిగా సఫలం అయ్యాయి.

అలా దూసుకొచ్చిన ప్రైవేటు ఆరోగ్య సంస్థల వాటా 2012 నాటికి 25 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేయబడింది. 2023 నాటికి అది 98.98 మిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. ఇది 2027 వరకు 173.59 బిలియన్‌ డాలర్లను దాటుతుందని ఒక అంచనా. నిపుణుల లభ్యం, విస్తతమైన పెట్టుబడులు, వివిధ రకాల మార్కెటింగ్‌ నైపుణ్యాలను ప్రదర్శించడం లాంటివి ప్రైవేట్‌ వైద్య రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాయి. ప్రైవేటు రంగం చేసే మార్కెటింగ్‌ ఎత్తుల వల్ల పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ప్రైవేటు వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సంస్థ చీఖీనూ లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 70% గ్రామీణ ప్రాంతాల్లో 63% ప్రజలు ప్రైవేటు రంగాన్ని ఎంచుకుంటున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న ఆరోగ్య కేంద్రంలోని సేవలు అరకొరగా ఉండడమే కాకుండా తగినంత నిపుణులు, సిబ్బంది లేకపోవడం, వైద్య కేంద్రాలు తక్కువగా ఉండడం లాంటి కారణాలు ప్రజలను ప్రైవేటు రంగం వైపు చూడటానికి కారణం అవుతున్నాయి.

భారత్‌ చాలా దూరంలో ఉంది
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అనే దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వాగ్దానాలు చేస్తున్నప్పటికీ ఏండ్లు గడిచినా అవి నెరవేరకపోగా మరింతగా ప్రభుత్వ వైద్యం ప్రజలకు దూరం అవుతున్నది. ఉత్తమమైన, నాణ్యమైన జీవన ప్రమాణాలను పెంచడంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కూడా అత్యంత ప్రధానమైనది. అందుకే చాలా దేశాలు తమ పౌరులకు ఉచిత ఆరోగ్యాన్ని అందించడం కోసం కషి చేస్తున్నాయి. యూకే, కెనడా, స్వీడన్‌, నార్వే, డెన్మార్క్‌, జపాన్‌, స్పెయిన్‌, ఆస్ట్రేలియా లాంటి సుమారు 70 దేశాలు తమ ప్రజలకు పూర్తిగా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాయి. దీనివల్ల ఆయా దేశాల్లో ప్రజల ఆరోగ్యంలో మెరుగైన ఫలితాలు రావడమే కాకుండా ప్రజల వ్యక్తిగత ఖర్చులు తగ్గడం, ఉత్పాదక శక్తి పెరుగుదలపై ప్రభావం చూపెడుతున్నది. అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ అమలు పరచడంలో స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ లాంటి దేశాలు ముందున్నాయి. ఈ దేశాలతో పోల్చినప్పుడు ప్రజలకు సార్వత్రిక ఆరోగ్య లక్ష్యాలను నెరవేర్చడంలో భారత్‌ చాలా దూరంలో ఉన్నదని చెప్పవచ్చు.

ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి
ప్రధాన స్రవంతిలో ఉన్న అల్లోపతి వైద్య విధానమే కాకుండా ఆయుష్‌ విభాగంలో ఉన్న ఆయుర్వేద, హోమియో, యునాని, నేచురోపతి విభాగాల ద్వారా కూడా ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నది. అయినప్పటికీ ఇవేవీ అంత ప్రయోజనకరంగా లేవు. ఆయుష్‌ విభాగంలో ఉన్న వైద్య విధానాలే కాకుండా అందులో ఇంకా చేర్చని ఎలక్ట్రో హోమియోపతి లాంటి వైద్య విధానాలు కూడా రోగాలను నయం చేయడంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఆయుష్‌లోని ఆయుర్వేద, హోమియోపతి లాంటి వైద్య విధానాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందించడానికి ప్రయత్నిస్తున్నా అవి అంతంత మాత్రమే. నిధుల కొరత, ప్రచారలేమి, తగినంత ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వలన ఆ రంగాల గురించి ప్రజలకు పెద్దగా తెలియడం లేదు. భారతదేశంలో ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహించాలి. వాటికి తగినంత నిధులను కూర్చి, తగినంత ప్రచారం ఇవ్వాలి. ప్రజలు వాటిని స్వీకరించేట్టుగా చేయడం ద్వారా మాత్రమే మనదేవంలో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అనే ఆశయం నెరవేరే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఈ వైపున దృష్టి సారించవలసిన అవసరం ఎంతో ఉన్నది.

డా.చెమన్‌ సింగ్‌, 9440385563

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -