- Advertisement -
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. యాజమాన్యం, జర్నలిస్టులు, సిబ్బంది కృషితో నిరంతరం ప్రజలకు అండగా ఉంటున్నది. ముందుకు పోతున్నది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నది. పరిష్కారాలను సూచిస్తున్నది. నవతెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి. తెలంగాణ ఆశలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను మరింత చొరవతో ప్రజలకు చేరవేయాలి. అట్టడుగు తరగతులకు అండగా ఉండాలి. ప్రజల ఆదరణను మరింత పొందాలి.
- Advertisement -


