- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో వంచిత్ బహుజన్ అగాడీ (వీబీఏ) అధినేత
ప్రకాశ్ అంబేద్కర్ భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో
పలువురు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు
కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఉద్యమంపై ప్రత్యేకంగా చర్చించుకున్నట్టు తెలిసింది. భేటీ అనంతరం ప్రకాశ్ అంబేద్కర్‌ను కేటీఆర్ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
- Advertisement -



