30 శాతం కమీషన్ల ప్రయత్నాలను మానుకోవాలి
ఇది భూభారతి కాదు…
భూహారతి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
30 శాతం కమీషన్ల
ప్రయత్నాలను మానుకోవాలికాలనీలు, అపార్ట్‌మెంట్లు,
ఇండ్లను బేషరతుగా తొలగించాలిఇది భూభారతి కాదు…
భూహారతి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్22ఏ కింద లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారనీ, 30 శాతం కమీషన్ల కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. 22ఏ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని కోరారు. మంగళవారం ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని ఆశించామనీ, రెవెన్యూ మంత్రి కేవలం ‘సారీ’తో సరిపెట్టారని అన్నారు. ‘‘తప్పు చేసింది అధికారులు కాదనీ ప్రభుత్వమేనని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అధికారులపై నెపం నెట్టడం సరికాదన్నారు. ప్రజలు కష్టార్జితంతో కొనుగోలు చేసిన కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇండ్లను నిషేధిత జాబితాలో చేర్చినట్లయితే వాటిని బేషరతుగా తొలగించి, బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ధరణి రక్షణ కవచంధరణి వ్యవస్థ ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా ఉండేదని కేటీఆర్ అన్నారు. యజమాని వేలిముద్ర లేకుండా ఆస్తి బదిలీ చేయడం సాధ్యం కాని విధంగా భద్రత ఉండేదన్నారు.
ప్రస్తుతం యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనీ, ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ఇది భూభారతి కాదనీ, భూ హారతి అని విమర్శించారు. అన్ని అడ్డగోలు చర్యలను నిలిపేసి, ప్రజల యాజమాన్య హక్కులకు రక్షణ కల్పించేలా యథాతథ పరిస్థితిని పునరుద్ధరించాలని కోరారు.అసైన్డ్ భూములపై హామీ నిలబెట్టుకోవాలిఅసైన్డ్ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేసి, వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని అన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే పేరుతో ముందుగానే ఒప్పందాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి పథకం వెనుక అక్రమాలు ఉన్నాయని చెప్పారు. రెండేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందనీ, తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.ప్రధాన ప్రతిపక్షాన్ని సభ నుంచి బయటకు పంపారుప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా నిరసన తెలిపే హక్కు తమకుందని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు అనని మాటలను అంటగట్టి, సభ నుంచి బయటకు పంపారని ఆరోపించారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశాల నుంచి తప్పించుకునేందుకే తమను సస్పెండ్ చేసిందన్నారు.
సస్పెండ్ చేసినప్పటికీ తాము ప్రజల్లోనే ఉన్నామని చెప్పారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూనే ఉంటామన్నారు.తప్పు చేసింది ప్రభుత్వం శిక్ష అనుభవిస్తున్నది ప్రజలు అని వ్యాఖ్యానించారు. నిషేధిత జాబితాలో ఆస్తులను చేర్చడం ద్వారా ప్రజల యాజమాన్య హక్కులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇవాళ తప్పించుకున్నా రేపు తప్పించుకోలేరని హెచ్చరించారు.పోలీసులపై నమ్మకం లేదు.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాంప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటిపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ సిబ్బందిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి అక్కడే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తున్నారని విమర్శించారు. పోలీసులను నమ్ముకుంటే న్యాయం దొరకదనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నామని చెప్పారు. న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నామని అన్నారు. కామన్ సివిల్ కోడ్‌పై ఇప్పుడే నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు తమ పార్టీ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.పోలీస్ స్టేషన్లలోనే గూండాల రాజ్యమా?రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయనీ, పోలీస్ స్టేషన్లలోనే దాడులకు తెగబడే స్థాయికి కాంగ్రెస్ అరాచక పాలన చేరిందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఇంటిపై వేలమంది గూండాలను పంపించి దాడి చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్లనే అడ్డాగా చేసుకుని హత్యాకాండకు తెరలేపిందని అన్నారు. కేసీఆర్ ఇంటిపై దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన తమను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి, అక్కడ కూడా తమపైకి గూండాలను ఉసిగొల్పారని చెప్పారు. సోమవారం విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తన పీఆర్‌వో మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్ రెడ్డిలపై ఏకంగా 15 మందితో దాడి చేయించారని విమర్శించారు. పోలీస్ స్టేషన్ లోపలే మఫ్టీలో వచ్చి దాడి చేసిన ఆ 15 మంది గూండాలా? లేక పోలీసులా? అనేది తేలాలని డిమాండ్ చేశారు. బాధితుల తరఫున ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి ఐదు గంటలపాటు నిలదీసి జీరో ఎఫ్‌ఐఆర్ చేయమన్నా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేని అత్యంత ఘోరమైన, దిగజారిన పరిస్థితులు నేడు తెలంగాణలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.



