అథ్లెట్లకు ఎం.ఎ.బేబీ అభినందనలు
భువనేశ్వర్ : భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అరుదైన ఘట్టం నమోదైంది. ఒకే రేజు ఇద్దరు భారతీయ అథ్లెట్లు తమ తమ విభాగాల్లో జాతీయ రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించారు. మహిళల లాంగ్ జంప్‌లో ఆన్సీ సోజన్ అద్భుత ప్రదర్శనతో 6.88 మీటర్లు దూకి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పారు. 22 క్రితం అంజుబాబీ జార్జ్ పేరున ఉన్న 6.83 మీటర్ల రికార్డును అధిగమించారు. అలాగే పురుషుల హైజంప్‌లో సర్వేష్ కుషారే 2.31 మీటర్లు హైజంప్ చేసి కొత్త రికార్డు నమోదు చేశారు. దీంతో తేజస్విన్ శంకర్ పేరిట ఉన్న 2.29 మీటర్ల రికార్డు చెరిగిపోయింది. సర్వేశ్ ప్రదర్శన భారత హైజంప్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ రెండు రికార్డులు భారత ఫీల్డ్ ఈవెంట్స్‌లో పెరుగుతున్న ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.
అథ్లెట్లకు ఎం.ఎ. బేబీ అభినందనలు
ఈ సందర్భంగా సీపీఐ(ఎం)జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఇద్దరు అథ్లెట్లను అభినందించారు. మహిళల లాంగ్ జంప్‌లో 22 ఏండ్ల నాటి జాతీయ రికార్డును అధిగమించిన ఆన్సీ సోజన్‌కు, అలాగే పురుషుల హైజంప్‌లో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన సర్వేశ్ కుషారేకు శుభాకాంక్షలు తెలిపారు. భారత అథ్లెటిక్స్ ప్రపంచ వేదికపై మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఈ విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఒకే రోజు రెండు జాతీయ రికార్డులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



