Monday, June 29, 2026
E-PAPER
Homeఆటలుతన్మయ్‌ శతక జోరు

తన్మయ్‌ శతక జోరు

- Advertisement -

కరీంనగర్‌ డైమండ్స్‌ తొలి విజయం

నవతెలంగాణ-హైదరాబాద్‌
టీజీ20 లీగ్‌లో కరీంనగర్‌ డైమండ్స్‌ తొలి విజయం సాధించింది. లీగ్‌ దశలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కరీంనగర్ డైమండ్స్‌.. మూడో మ్యాచ్‌లో మెరిసింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో వరంగల్‌‌ వారియర్స్‌పై 2 పరుగు తేడాతో గెలుపొందింది. 210 పరుగుల భారీ ఛేదనలో వరంగల్‌ వారియర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఆమన్‌ రావు (12) నిరాశపరిచినా, రిషికెత్‌ సిసోడియ (65, 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), భవేశ్‌ సేతు (53 నాటౌట్‌, 27 బంతుల్లో 6 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కగా.. హర్షిత్‌ చౌదరి (31, 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. వరంగల్‌ వారియర్స్‌ను 207 పరుగులకే కట్టడి చేసిన కరీంనగర్‌ డైమండ్స్‌ బౌలర్లు ఆ జట్టుకు లీగ్‌లో తొలి విజయాన్ని కట్టబెట్టారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన కరీంనగర్‌ డైమండ్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (133, 61 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదంతొక్కాడు. తన్మయ్‌ సెంచరీతో చెలరేగినా.. ఇతర బ్యాటర్లు అంచనాలను అందుకోలేదు. హృషికేశ్‌ సింహా (24, 21 బంతుల్లో 3 ఫోర్లు) మినహా ఆ జట్టులో మరో బ్యాటర్‌ మెప్పించలేదు. సెంచరీతో మెరిసిన తన్మయ్‌ అగర్వాల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’గా నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -