కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు
నవతెలంగాణ-మద్నూర్
ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తుందని కాంగ్రెస్ మండలాధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. సోమవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కృషి ఫలితంగా మహిళా సంఘాల నూతన భవనాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గ గ్రామంలో రూ.10 లక్షల నిధులతో మహిళా సంఘం భవన నిర్మాణానికి నేడు భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దిగంబర్, ఆ గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండురంగ పాటిల్, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, యువ నాయకుడు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



