Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా పస్కా నర్సయ్య నియామకం 

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా పస్కా నర్సయ్య నియామకం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యేండల ప్రదీప్ చేతుల మీదుగా మాజీ ఎంపీపీ ఆర్మూర్, తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్, పస్క నర్సయ్యను ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం బలోపేతానికి, ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షులు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సల్ల ప్రవీణ్ పాల్గొని పస్కా నర్సయ్యకు అభినందనలు తెలియజేశారు. జిల్లాల్లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పనిచేస్తామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకానికి వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి కి రాష్ట్ర అధ్యక్షులు యేండల ప్రదీప్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉమ్మడి జిల్లాల్లో సంఘాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరించి ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -