Monday, June 29, 2026
E-PAPER
Homeబీజినెస్10 ఏళ్ల లైఫ్ కవర్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్

10 ఏళ్ల లైఫ్ కవర్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్

- Advertisement -

నవతెలంగాణ – ముంబై: గృహ రుణాలు, వ్యాపార రుణాలు, పిల్లల చదువుల వంటి నిర్దిష్ట ఆర్థిక బాధ్యతలు ఉన్న కస్టమర్ల కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ స్మార్ట్ ప్లస్’ (ICICI Pru iProtect Smart Plus) పేరుతో 10 ఏళ్ల లైఫ్ కవర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కుటుంబంలో ఆర్థిక బాధ్యతలు, ఆదాయంపై ఆధారపడే పరిస్థితి అత్యధికంగా ఉండే కీలక సమయంలో ఈ పాలసీ, జీవిత బీమా కవరేజీని అందిస్తుంది.

చాలా మంది వ్యక్తులకు, ఒక పెద్ద ఆర్థిక బాధ్యతను నెత్తిన వేసుకున్న తర్వాత మొదటి పదేళ్ల కాలం అత్యంత కీలకమైనదిగా ఉంటుంది. నిర్దిష్ట కాలపరిమితితో బిజినెస్ రుణాలు తీసుకున్న స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు, హోమ్ లోన్ తీసుకున్న వారికి మరియు పిల్లల ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేస్తున్న తల్లిదండ్రులకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కీలక దశలో కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించేలా, అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే ఈ 10 ఏళ్ల లైఫ్ కవర్ సొల్యూషన్‌ను రూపొందించారు.

“ఇల్లు కొనడం, వ్యాపారాన్ని తీర్చిదిద్దుకోవడం లేదా పిల్లల చదువుల కోసం డబ్బు సమకూర్చుకోవడం వంటి అనేక ఆర్థిక లక్ష్యాలు ఒక నిర్దిష్ట కాలపరిమితితో ముడిపడి ఉంటాయి. కస్టమర్లు తమ ఆర్థిక బాధ్యతలను నిర్వర్తిస్తూనే, కుటుంబ సభ్యుల ఆర్థిక భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు వీలుగా ఈ కీలకమైన సంవత్సరాల్లో రక్షణ కల్పించడానికి ‘ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ స్మార్ట్ ప్లస్’ను రూపొందించాము. జీవితంలో వివిధ దశల్లో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రక్షణ పరిష్కారాలను అందించాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం. తద్వారా భారత్‌లో బీమా విస్తృతిని పెంచి , ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే లక్ష్యానికి మా వంతు సహకారం అందిస్తున్నాము” అని ఈ కొత్త ప్లాన్ లాంచ్ సందర్భంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ వికాస్ గుప్తా తెలిపారు.

ఈ ప్లాన్ యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే, 10 ఏళ్ల పాలసీ కాలపరిమితి పొడవునా లైఫ్ కవర్ మొత్తం ఏమాత్రం తగ్గకుండా స్థిరంగా ఉంటుంది. దీనివల్ల పాలసీదారుని కుటుంబానికి పూర్తి బీమా మొత్తం అందుతుంది. ఇది కేవలం రుణ బాధ్యతలను తీర్చడానికే కాకుండా, ఇతర ఆర్థిక అవసరాలను మరియు భవిష్యత్తు లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కూడా కుటుంబానికి ఎంతగానో తోడ్పడుతుంది.

వ్యక్తులు మరియు వారి కుటుంబాలు మరింత ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంలో సహాయపడే చక్కని బీమా పరిష్కారాలను అందిస్తూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తన ప్రొటెక్షన్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ ప్లాన్ తోడ్పడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -