Monday, June 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఉత్తర జర్మనీలో కాల్పులు కలకలం

ఉత్తర జర్మనీలో కాల్పులు కలకలం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తర జర్మనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్టేడ్ పట్టణంలోని యువ కేంద్రం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులతో సంబంధమున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

సిటీ మధ్యలో రద్దేగా ఉండే ఈ ప్రాంతంలో తుపాకులతో వచ్చిన కొందరు అక్కడి వారిపై కాల్పులు జరిపారు. ఒక్కసారిగా కాల్పుల మోతతో జనాలు భయభ్రాంతులకు లోనయ్యారు.బుల్లెట్ గాయాలతో ఐదుగురు చనిపోయారని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్‌ (ఏఎఫ్‌పీఈ) వార్త సంస్థతో ఓ పోలీసు అధికారి చెప్పారు. సమాచారం అందగానే అక్కడి వెళ్లిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -