నవతెలంగాణ – ముంబయి: జావా ఆల్ స్టార్స్ ప్రారంభాన్ని ప్రకటించిన జావా యెజ్డీ మోటార్ సైకిల్స్. ఇది ఎంతో కాలంగా జావా రైడర్స్ ను నిర్వచించిన విలువలు యొక్క కొత్త రూపం. ఈ కొత్త అధ్యయంలో మొదటి అడుగు జావా 42 FJ ద్వారా వచ్చింది, బ్రాండ్ యొక్క నియో-క్లాసిక్ డిజైన్ భాష యొక్క తాజా మరియు సమకాలీన వ్యాఖ్యానం తెస్తోంది.
ఎన్నో ఏళ్లుగా, జావా యొక్క మార్గదర్శక స్ఫూర్తి అనేది అనుకరణ కంటే వ్యక్తిత్వానికి, ప్రదర్శన కంటే ఆత్మవిశ్వాసానికి విలువనిచ్చే ఒక ప్రత్యేకమైన రైడర్ రకంతో ప్రతిధ్వనించింది. ఈ రైడర్లు ఎల్లప్పుడూ వ్యక్తం చేయని నియమావళిని భాగస్వామ్యం చేసారు, ఇది వారు చెప్పే మాటలు ద్వారా కాకుండా, వారు తీసుకునే నిర్ణయాలు మరియు తమను తాము ప్రవర్తించుకునే విధానం ద్వారా వ్యక్తమవుతుంది. జావా ఆల్ స్టార్స్ ఈ నియమావళికి ఒక పేరు ఇచ్చింది. గుర్తింపు, గౌరవం మరియు తమ సొంతం అనే బంధానికి గుర్తుగా నక్షత్రానికి గల శాశ్వతమైన ప్రతీకాత్మకత నుండి ప్రేరణ పొందిన ఆల్ స్టార్స్ విజయానికి లేదా ఆధిపత్యానికి చిహ్నం కాదు, అది ఒక జీవన విధానానికి చిహ్నం. వ్యక్తుల ప్రయాణాలు ఎటు వైపు కొనసాగినా, ఒకే రకమైన అభిప్రాయంతో రైడర్స్ ను కలిపే కనిపించని భావనకు ఇది కంటికి కనిపించే చిహ్నం. వివిధ ప్రయాణాలు. వివిధ వ్యక్తిత్వాలు. ఒక భాగస్వామ్యం చేసిన స్ఫూర్తి. ఇదే జావా ఆల్ స్టార్స్ నియమావళి- కారక్టర్, ప్రవర్తన మరియు ధైర్యం.
జావా 42 FJ బ్రాండ్ యొక్క నియో-క్లాసిక్ శైలిని మరింత స్పోర్టీగా మరియు మరింత సమకాలీనంగా రూపొందించడం ద్వారా ఈ సిద్ధాంతాన్ని నిజం చేస్తోంది. దీనిని పరిచయం చేసిన నాటి నుండి, జావా 42 FJ తమ విలక్షణమైన నియో-క్లాసిక్ డిజైన్, రోడ్డు పై శక్తివంతమైన ఉనికి మరియు ఆకర్షణీయమైన పెర్ఫార్మెన్స్ కోసం విస్తృతమైన ప్రశంశను సంపాదించింది. జావా 42 FJ వ్యూయర్స్ ఛాయిస్ బైక్ ఆఫ్ ద ఇయర్ ( 2024) మరియు వ్యూయర్స్ ఛాయిస్ మోటార్ సైకిల్ ఆఫ్ ద ఇయర్ ( 2025)అవార్డ్స్ ను గెలుచుకుంది, ఇది ఔత్సాహికులలో విస్తృతమైన ఆకర్షణను సూచిస్తోంది మరియు భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన నియో-క్లాసిక్ మోటార్ సైకిల్స్ లో ఒకటిగా తన స్థానాన్ని మరింత శక్తివంతం చేసుకుంటోంది.
అనుపమ్ థరేజ, సహ-స్థాపకులు, క్లాసిక్ లెజెండ్స్, ఇలా అన్నారు, “ జావా ఎల్లప్పుడూ తాము ఎవరో ఖచ్చితంగా తెలిసిన రైడర్స్ ను ఆకర్షించింది. వారు ఎన్నడూ ట్రెండ్స్ ను అనుసరించడం కోసం వాటిని అనుసరించలేదు లేదా వివిధ ఎంపికలు చేసుకుని గుర్తింపు పొందాలని కోరుకోలేదు. కాలక్రమేణా, ఈ రైడర్స్ ను కలిపే ఒక ఉమ్మడి స్ఫూర్తి ఉందని మేము తెలుసుకున్నాము. ఆ స్ఫూర్తిని గుర్తించి మరియు సంబరం చేసుకునే మా విధానమే జావా ఆల్ స్టార్స్. ఇది జావా వారసత్వంగా ఎల్లప్పుడూ భావించే విలువలైన కారక్టర్, ప్రవర్తన మరియు ధైర్యానికి ఒక నివాళి. జావా 42 FJ ఆ సిద్ధాంతం యొక్క మొదటి రూపం, సమకాలీన డిజైన్, పెర్ఫార్మెన్స్ మరియు స్పష్టంగా తనదైన ఒక సొంత వ్యక్తిత్వం ద్వారా నిజం చేసింది. ”
జావా 42 FJ ఈ విభాగంలోనే మొదటిసారి బ్రష్ట్ అల్యూమినియం ట్యాంక్ ప్యానెల్స్, స్పోర్టీ రూపం మరియు ఉత్తమమైన ఫినిషింగ్ తో ఆ విధానంపై ఆధారపడింది. దీనిలో ఉన్న 334-cc లిక్విడ్-కూల్డ్ DOHC సింగిల్-సిలిండర్ ఇంజన్ 29.17 PS ని మరియు 5,500 rpm వద్ద 29.62 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, ఫలితంగా ఈ విభాగంలో అత్యధిక శాతం 350 cc మోటార్ సైకిళ్ల కంటే ఇది 42 శాతం వరకు అధిక శక్తిని ఇస్తుంది. ఆధునిక ఫీచర్లలో పూర్తి డిజిల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పూర్తి LED లైటింగ్ లు ఆధునిక పనితీరును జావా యొక్క నియో-క్లాసిక్ కారక్టర్ తో మిశ్రమం చేస్తున్నాయి.
దీని సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్, డబల్-క్రేడల్ ఫ్రేమ్, 41 mm టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు ఫైవ్-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్ తో గ్యాస్-నిండిన ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్ స్థిరత్వం, నియంత్రణ, మరియు రైడర్ సౌకర్యం కోసం అనుమతినిస్తాయి. డ్యూయల్-ఛానల్ ABS వరుసగా 320 mm మరియు 240 mm ఫ్రంట్ మరియు రియర్ డిస్క్స్పై పని చేస్తుంది, మరియు ఉన్నతమైన కార్నరింగ్ గ్రిప్ మరియు స్థిరత్వం కోసం మోటార్ సైకిల్ 100/90-18 ఫ్రంట్ టైర్ మరియు 140/70 R17 రియర్ టైర్ పై రైడ్ చేస్తుంది.
790 mm సీట్ ఎత్తు, 178 mm గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 12-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ తో, 42 FJ సాహసవంతమైన రోడ్డు ఉనికితో సులభంగా ఉపయోగించగల ఎర్గోనిమిక్స్ ను మిశ్రమం చేస్తుంది. జావా ఆల్ స్టార్స్ 42 FJ రూ. 2,01,942/- నుండి ప్రారంభమవుతుంది మరియు భారతదేశంలోని ఆరు విలక్షణమైన రంగులలో జావా యెజ్డీ డీలర్ షిప్స్ లో లభిస్తుంది.



