నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 21న నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, భారతదేశంలోని 5,440 కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాలలో జరిగిన ఈ NEET (UG) 2026 పునఃపరీక్షకు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. హిందీ, ఆంగ్లంతో సహా మొత్తం 13 భాషలలో ఈ పరీక్ష నిర్వహించారు. తాజాగా నీట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ పై అభ్యంతరాల స్వీకరణ పూర్తి అయిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది. దాదాపు 10వేలకు పైగా అభ్యంతరాలు వచ్చినట్లు తెలియజేసింది. అతి త్వరలోనే నీట్ ఫలితాలు వెల్లడి కానున్నాయని సబంధింత వర్గాలు పేర్కొన్నాయి.
జూన్ 21న, దేశవ్యాప్తంగా, విదేశాల్లోని 14 కేంద్రాలలో ‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్’ (NEET-UG) 2026కు సంబంధించిన అత్యంత కీలకమైన పునఃపరీక్ష (re-examination) ముగిసింది. ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఆ సంస్థ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది.



