Tuesday, June 30, 2026
E-PAPER
Homeజాతీయంలైంగిదాడి కేసు..బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ తుది వాదనలు పూర్తి

లైంగిదాడి కేసు..బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ తుది వాదనలు పూర్తి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మహిళ రెజ్లర్ లపై లైంగిదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుంది. ఈ కేసులో ఢిల్లీలోని రౌజ్ రెవిన్యూ కోర్టులో ప్రధాన నిందితుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్, వినోద్ తోమర్‌ తుది వాదనలు విన్పించారు. మహిళ రెజ్లర్ చేసిన లైంగిక ఆరోపణలను ఖండించారు. ఫిర్యాదుదారుల తరపున తుది వాదనల కోసం కోర్టు ఈ కేసును బుధవారానికి నిర్ణయించింది.ఆ తర్వాత తీర్పును రిజర్వ్ చేసే అవకాశం ఉంది. అంతకుముందు, ఈ ఏడాది మే 12న, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సభ్యుని వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసు నమోదైంది. వారి ఫిర్యాదుల మేరకు, ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం, ఢిల్లీ పోలీసులు 2023 జూన్ 15న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ , వినోద్ తోమర్‌లపై దాదాపు 1,500 పేజీల ఛార్జ్ షీట్‌ను దాఖలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -