నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో 113 కొత్త అడ్మిషన్లు వచ్చినట్లు హెచ్ఎం కమల తెలిపారు. 113వ అడ్మిషన్ తీసుకునేందుకు ఎంఈఓ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు,ఇంగ్లీష్ మీడియం బోధన,మన ఊరు-మన బడి పిఎం సిరి వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు కారణంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగింది. ఫలితంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు వలసలు పెరిగి, అనేక పాఠశాలల్లో అడ్మిషన్లు భారీగా పెరుగుతున్నాయి.
స్మార్ట్ తరగతులు, డిజిటల్ విద్య, ప్రయోగశాలలు మరియు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మరియు మధ్యాహ్న భోజనంతో పాటు పౌష్టికాహారాన్ని అందచేస్తున్నామని అందుకే ప్రవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అధికంగా ఉండి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు కనుక ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతున్నాయని ప్రవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు కమల,నాగనాథ్, కిషోర్,రాజు,సుదర్శన్ రెడ్డి ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



