Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి కొండ సురేఖ నివాసం వద్ద మున్సిపల్ కార్మికుల ఆందోళన

మంత్రి కొండ సురేఖ నివాసం వద్ద మున్సిపల్ కార్మికుల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా, పరకాల మున్సిపాలిటీకి చెందిన సిఐటియు కార్మికులు హనుమకొండలోని మంత్రి కొండ సురేఖ నివాసాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో వందలాది మంది కార్మికులు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని, మరణించిన కార్మికుల అంత్యక్రియల కోసం 30,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు.

60 ఏళ్లు నిండిన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తమకు నిలువ నీడ లేదని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి ఆదుకోవాలని వారు కోరారు. ఆందోళనను గమనించిన ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ డిమాండ్లపై మంత్రి కొండ సురేఖతో చర్చించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టి. ఉప్పలయ్య, బొట్ల చక్రపాణి, యాస బాబు, మహేష్‌తో పాటు పరకాల మున్సిపాలిటీకి చెందిన పలువురు సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -