Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్యులు ప్రజలకు అందుబాటులో లేకపోతే కఠిన చర్యలు: కలెక్టర్

వైద్యులు ప్రజలకు అందుబాటులో లేకపోతే కఠిన చర్యలు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ -చిన్నకోడూరు 
వైద్యులు ప్రజలకు అందుబాటులో లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ హైమావతి  హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఓపి రికార్డులను, రోగుల పట్టికను పరిశీలించారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. .క్షేత్రస్థాయి పర్యటనలకు వెళితే తప్పనిసరిగా పి హెచ్ సి కి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టాకే ఫీల్డ్ కి వెళ్లాలని, ఫీల్డ్ వివరాలు సైతం అటెండెన్స్ రిజిస్టర్ లో మెన్షన్ చేయాలని మెడికల్ ఆఫీసర్ ను హెచ్చరించారు.వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ఆసుపత్రికి సరిపోయే మందులను తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -