Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్య కేంద్రానికి రెగ్యులర్ డాక్టర్లను నియమించాలి

ఆరోగ్య కేంద్రానికి రెగ్యులర్ డాక్టర్లను నియమించాలి

- Advertisement -

కాన్పులు పునఃప్రారంభించాలి – దంత వైద్యుడు, గైనకాలజిస్టును నియమించాలని డిమాండ్
స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేసి ప్రజల ఆరోగ్య హక్కును కాపాడాలి
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ బృందం ఆస్పత్రి సందర్శన
నవతెలంగాణ – ఉప్పునుంతల

మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి రెగ్యులర్ డాక్టర్లను నియమించి, స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు గైనకాలజిస్టు, దంత వైద్యుడిని వెంటనే నియమించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించిన అనంతరం సీపీఎం మండల కార్యదర్శి చింతల నాగరాజు ఈ వివరాలను తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎల్. దేశ్యా నాయక్ మాట్లాడుతూ, ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాలు ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత కారణంగా ఎక్స్‌రే, ఈసీజీ వంటి సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని అన్నారు. వెంటనే టెక్నీషియన్లను నియమించి ప్రజలకు అన్ని వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆస్పత్రిలో కాన్పులు నిర్వహించేలా గైనకాలజిస్టును నియమించాలని, దంత వైద్య సేవలను ప్రారంభించాలని, స్పెషలిస్టు వైద్యులను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టాఫ్ నర్స్ పోస్టులు 14 ఉండగా ప్రస్తుతం నలుగురు మాత్రమే పనిచేస్తున్నారని, దీంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

రాత్రి వేళల్లో కూడా డాక్టర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి మండల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఆరోగ్యం ప్రతి పౌరుడి హక్కని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం. శంకర్ నాయక్, అచ్చంపేట మండల కార్యదర్శి సైదులు, సీపీఎం సీనియర్ నాయకుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -