- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హీరో మహేశ్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. మూవీ టికెట్లపై జీఎస్టీ రేట్లు తగ్గినా, ఆ ప్రయోజనాన్ని ప్రేక్షకులకు వర్తింపజేయకుండా లాభపడినందుకు ఎఎంబీ సినిమాస్‌తో సహా తెలంగాణలోని ఐదు థియేటర్లపై వస్తు సేవల పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (బీఎస్టీఎటీ) కఠిన చర్యలు తీసుకుంది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని యాంటీ-ప్రాఫిటీరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మొత్తం రూ.1.7 కోట్లను వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది.
- Advertisement -



