నవతెలంగాణ – తిమ్మాజిపేట
రెవెన్యూ శాఖలో అటెండర్ గా సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఆశన్న గారి మనెమ్మ మండల కేంద్రంలో ఉన్న తాసిల్దార్ కార్యాలయంలో వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో తాసిల్దార్ జయంతి తన సిబ్బందితో శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ జయంతి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
విధి నిర్వహణలో సమయపాలన, పారదర్శకత, అంకితభావం, సేవా దృక్పథంతో పనిచేస్తూ సహోద్యోగులు, అధికారులు, ప్రజలందరి మన్ననలు పొందారని తెలిపారు. తోటి ఉద్యోగులకు మార్గదర్శిగా వ్యవహరిస్తూ, సేవాభావంతో పనిచేసిన ఆమె అందరికీ ఆదర్శప్రాయమైన ఉద్యోగిగా నిలిచారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది ప్రభుత్వ సేవలకు ముగింపు మాత్రమేనని, జీవితంలో మరో కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నరు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ప్రశాంత జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ జ్యోతి ఆర్ ఐ లు అనురాధ, జ్యోతి సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ ఉదయ్, రామ్ చందర్, జిపిఓ లు వెంకటేష్, శేఖర్, రాజేష్, రమేష్, శశికళ, ఆశన్న గారి మన్నెమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



