Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దవంగర నూతన ఎంపీడీవో గా సురేష్ 

పెద్దవంగర నూతన ఎంపీడీవో గా సురేష్ 

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవంగర 
పెద్దవంగర మండల నూతన ఎంపీడీవో గా సురేష్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన హసన్ పర్తి ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తూ, పదోన్నతి పై ఇక్కడికి వచ్చారు. గతంలో ఇక్కడ ఎంపీడీవో గా విధులు నిర్వర్తించిన బోడెపూడి వేణుమాధవ్ మంగళవారం పదవీ విరమణ చేశారు. మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు నూతన ఎంపీడీవో సురేష్ కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సకాలంలో చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్ పనుల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -