నవతెలంగాణ -పెద్దవంగర
కాంగ్రెస్ పార్టీ మండల నూతన అధ్యక్షుడిగా కొరిపల్లి గ్రామ సర్పంచ్, సీనియర్ నాయకులు రంగు మురళీ గౌడ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల అధ్యక్షుడిగా తనను నియమించిన పార్టీ అధిష్టానానికి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తూ, మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా రంగు మురళీ గౌడ్
- Advertisement -
- Advertisement -



