Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు సంక్షేమమే, ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: కలెక్టర్

రైతు సంక్షేమమే, ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: కలెక్టర్

- Advertisement -

వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రైతు భరోసా 
నవతెలంగాణ – రామారెడ్డి 

రైతుల సంక్షేమమే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు భరోసా నిధుల విడుదల ముఖ్యమంత్రి కార్యక్రమంలో  వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించడం, సాగుకు అవసరమైన ఆర్థిక సహాయం సకాలంలో అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుందని అన్నారు.

ఈ పథకం ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా ఆర్థిక సహాయం జమ చేయడం వల్ల పారదర్శకతతో పాటు సకాలంలో పెట్టుబడి అంది అవకాశం కలుగుతుందని అన్నారు. జిల్లాలో 2025-26 వానాకాలం సీజన్లో 1081 మంది రైతులకు రు. 9, 35, 33, 535 రైతు భరోసా నిధులు జమయాయని, 2025-26 యాసంగి సీజన్లో 10,950 మంది రైతులకు రూ. 7, 34, 81, 776 ఆర్థిక సహాయాన్ని అందించామని వెల్లడించారు. 2 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలో ఇప్పుడు జమ అవుతాయని, మిగతా 9 రోజుల్లో జమవుతాయని అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా సహాయం అందేలా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, దరఖాస్తులు, అర్హత పరిశీలన, నిధుల జమా ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయ ఉత్పత్తులను, పెంచుకోవడంతో పాటు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి, అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి ఎన్ గిరి, డిప్యూటీ ట్రైన్ కలెక్టర్ రవితేజ, డీఏ వో మోహన్ రెడ్డి, ఏ డి ఏ సుధా మాధురి, ఎమ్మార్వో ఉమలత, ఏవో భాను శ్రీ, స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ నవీన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, ఏఈఓ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -