Tuesday, June 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'చంద్రప్పన్` రిలీజ్ డేట్ ఫిక్స్

‘చంద్రప్పన్` రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

డా. పి. యష్మన్, సోనాలీ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా 'చంద్రప్పన్. హీరోగా నటించడంతో పాటు ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, డైరెక్షన్ చేస్తున్నారు డా.పి. యష్మన్. ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈనెల 24న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి. సముద్ర, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డైరెక్టర్ వి.సముద్ర మాట్లాడుతూ,’ఈ సినిమా పేరు “చంద్రప్పన్” అయినా వీరప్పన్ లా టైటిల్ సౌండింగ్ ఉంది. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. రా అండ్ రస్టిక్ మేకింగ్ తో ఆకట్టుకుంటోంది. యష్మన్ కథ, స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్, పాటలు రాయడం విశేషం. ఆయన ఈ కథలో ఒదిగిపోయి నటించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. హీరోయిన్ కు కూడా ఈ చిత్రంతో మంచి పేరు రావాలిఅని అన్నారు. 'గెస్టులుగా చాలా సినిమాలకు పిలుస్తుంటారు. ఏదో చేసి ఉంటారులే అనుకున్నా కానీ ఈ సినిమా ట్రైలర్, పాటలు చూశాక ఇంప్రెస్ అయ్యాను. మంచి క్వాలిటీతో కంటెంట్ తో సినిమా చేశారు. ఇలాంటి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తేనే మరిన్ని మూవీసే చేయగలగుతారు అని ప్రొడ్యూసర్ కేఎల్ దామోదర ప్రసాద్ చెప్పారు.
హీరో, డైరెక్టర్ డా.పి.యష్మన్ మాట్లాడుతూ,’ఫిలింఛాంబర్ కు ఏ కొత్త ప్రొడ్యూసర్ వెళ్లినా దామోదర ప్రసాద్ ఇండస్ట్రీలోని మంచి, చెడ్డలు చెబుతుంటారు. ఆయన సలహాలు ఎంతో విలువైనవి. డైరెక్టర్ సముద్ర సింహరాశి మూవీ నా ఫేవరేట్ ఫిలిం. ఇక్కడికి రాగానే ఏదో బిజినెస్ అవుతుందని అనుకోవద్దు. మేము చాలా జాగ్రత్తగా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల టేస్ట్ కు తగినట్లు మూవీ చేశాం. చాలా మంచి కాస్టింగ్ మా మూవీలో ఉంది. వాళ్లంతా డైరెక్టర్ గా నేను ఎలా చెబితే అలా పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. సినిమా కూడా అలాగే ఉంటుంది. ఈనెల 24న రిలీజ్ అవుతున్న మా సినిమాను కూడా ఇలాగే సపోర్ట్ చేయండి` అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -