Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిఎడ్ రద్దు చేయడం హాస్యాస్పదం

డిఎడ్ రద్దు చేయడం హాస్యాస్పదం

- Advertisement -

– డిఎడ్, డియస్సి అభ్యర్థుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కమలాకర్ 
– డీఎడ్ రద్దు ప్రతిపాదన విరమించుకోవాలి 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్య కమిషన్ సమర్పించిన ప్రతిపాదనలో డీ.ఎడ్(డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్) కోర్స్ రద్దు చేయాలని సిఫార్సు చేయడం హాస్యాస్పదమని డిఎడ్, డియస్సి అభ్యర్థుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి. కమలాకర్ అన్నారు.  శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తెలంగాణ విద్యా విధానాలు 2026 లోని  ప్రతిపాదనలో డిఎడ్ ను రద్దు చేసి పూర్వ ప్రాథమిక పాఠశాలలో బిఎడ్, పిజి ఉండాలనడం విద్య కమిషన్ సభ్యుల అవివేకానికి నిదర్శనం అన్నారు.

సుప్రీం కోర్టు, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక స్థాయి ఫోస్టులకు కేవలం డిఎడ్ వారే అర్హులు అని, టెట్ పేపర్-1 ఉన్నవారే  డీఎస్సీ పరీక్షలు, ఎస్జీటీ కి అర్హులనే విషయం తెలియక విద్య కమిషన్, డిఎడ్ రద్దు  చేయలనీ సిపార్సు చేయడం దుర్మర్గమైన చర్యగా ఆయన పేర్కొన్నారు.

గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో  ఎన్సీటీఈ  ఉత్వర్యుల ప్రకారం డిఎడ్ వారికే ప్రాథమిక ఉపాధ్యాయ పోస్టుల్లో అమలు చేసిందని గుర్తు చేశారు.జాతీయస్థాయిలో డిఎడ్ అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే అవగాహన రాహిత్యంతో మన రాష్ట్రంలో డీఎడ్ ను రద్దు చేయాలని సిఫారసు చేయడం సిగ్గుచేటన్నారు. విద్యావ్యవస్థపై అవగాహన లేని సభ్యులతో కమిటీ వేసి సలహాలు తీసుకుంటే  విద్యార్థుల జీవితాలు అధోగతి అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.మరో ప్రక్కన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. 

వెంటనే ప్రభుత్వ స్పందించి కమిటీ ఇచ్చిన డిఎడ్ రద్దు ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  ప్రతిపాదనను రద్దు చేయకుంటే లక్షలమంది అభ్యర్థులు పరిస్థితి రోడ్డు పాలు అయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ స్పందించి ప్రతిపాదన రద్దు చేయాలని లేని పక్షంలో డిఎడ్  అభ్యర్థులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. 

తెలంగాణ విద్య కమిషన్ కు, తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని పాఠశాలలను పరిశీలించి మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని కమలాకర్ డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -