- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్‌కార్డుదారులకు జులై నెలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమైంది. ఈ విడతలో సుమారు 1.06 కోట్ల అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు, దీని ద్వారా 3.41 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. పౌరసరఫరాల శాఖ 2.15 లక్షల టన్నుల బియ్యాన్ని సిద్ధం చేసి, జిల్లాల వారీగా సరఫరాను పూర్తి చేసింది.
- Advertisement -



