నవతెలంగాణ – కామారెడ్డి
ఎంసీపీఐయు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎంసీపీఐయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ అధికారికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి జబ్బర్ మాట్లాడుతూ, పేదలకు వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసి, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ మాఫియా అక్రమాలను అరికట్టాలని, గుడిసెవాసులపై పోలీసులు, రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రయోగించి ఇళ్ల కూల్చివేతలకు పాల్పడటాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు.
గుడిసెవాసులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేసి, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రమేష్, ఆసిఫ్, రాజు, సత్యం, నరసింహులు, లింగం, అస్మా, పార్వవా తదితరులు పాల్గొన్నారు.


