– పిఆర్టియు నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
సమాజంలో ఉపాధ్యాయులను కించపరిచే విధంగా రిపోర్టు తయారుచేసి విద్యా కమిషన్ అందించిన రిపోర్టును వెనక్కి తీసుకోవాలని హుస్నాబాద్ పి ఆర్ టి యు నాయకులు డిమాండ్ చేశారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని మహ్మదాపూర్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఆవరణంలో పి.ఆర్.టి.యు నాయకులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులను పై రిపోర్ట్ తయారుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులను కించపరిచిన వాటిని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల అధ్యక్షుడు కొలుగూరి తిరుపతిరెడ్డి, పిఆర్టియు అసోసియేట్ అధ్యక్షుడు లింగారెడ్డి, పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు మహేందర్ , తిరుపతి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రమా దేవి , కిషన్ నాయక్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు
ఉపాధ్యాయుల కించపరిచే రిపోర్టు వెనక్కి తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



