Thursday, July 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలోని నిరుద్యోగుల‌కు తీపి కబురు..

తెలంగాణలోని నిరుద్యోగుల‌కు తీపి కబురు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు, విద్యావంతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని మూడు ప్రతిష్టాత్మక వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 984 అధ్యాపక, ఇతర పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన మార్పునకు శ్రీకారం చుడుతూ, ఇప్పటివరకు ఉన్న ఇంటర్వ్యూ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇకపై కేవలం రాతపరీక్షలో సాధించిన మార్కులు, అకడమిక్ మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం (పీవీఎన్ఆర్‌టీవీయూ)లలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, ఎలాంటి అవినీతి, సిఫార్సులకు తావులేకుండా చూడటమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రూప్-1 వంటి ఉన్నతస్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, అదే విధానాన్ని విశ్వవిద్యాలయాల నియామకాల్లోనూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -