Thursday, July 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉగాండాలో భారతీయ మహిళ ఆత్మహత్య

ఉగాండాలో భారతీయ మహిళ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉగాండాలో భారతీయ మహిళ ఆత్మహత్య చేసుకుందని కర్నాటకలోని విజయనగర జిల్లా కొట్టూరు పోలీసులు వెల్లడించారు. కొట్టూరు తాలూకా కన్ననాయకనకట్టెకి చెందిన బిందు (24) భర్త ఉగాండాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల భర్త వద్దకు ఆమె వెళ్లారు. ఈ క్రమంలో బిందు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై వివరాలు సేకరిస్తున్నామని కొట్టూరు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -