నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది మృతి చెందారు. ఈ పేలుడు ఘటనలో 18 మంది గాయపడినట్లు సమాచారం. పిప్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనోరి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతులంతా ఆ పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో నివసించేవారేనని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఒక్కదాన్నే ప్రమాదం నుంచి బయటపడ్డా
ప్రమాద సమయంలో పరిశ్రమలోనే ఉన్న ఓ బాలిక ప్రాణాలతో బయటపడింది. ‘అసలేం జరిగిందో తెలియదు. నేను ఒక్కదాన్నే ప్రమాదం నుంచి బయటపడ్డా. బయటకు వచ్చేటప్పుడు నాకు ఎవరూ కనిపించలేదు. మా అమ్మానాన్న, నా ఇద్దరు చిన్న తమ్ముళ్లు అక్కడే ఉన్నారు’ అంటూ బాలిక గుక్కపెట్టి కన్నీళ్లు పెట్టుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


