- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అన్నా హజారే (87) అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఇన్‌ఫెక్షన్, డీహైడ్రేషన్‌తో ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబయిలోని బాంబే ఆస్పత్రి ఐసీయూలో చేర్పించారు. తొలుత రాలేగణ్ సిద్ధి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనకు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబయికి తరలించారు. కిడ్నీ పనితీరుతో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
- Advertisement -


