- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తొలితరం మహిళా మావోయిస్టు నేత కోర్సింగే మోతీబాయి అలియాస్ రాధక్క (65) తీవ్ర అనారోగ్యంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో సోమవారం కన్నుమూశారు. గిరిజన ప్రాంతం నుంచి ఉద్యమంలోకి వచ్చిన ఆమె తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో సుదీర్ఘకాలం వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది ఆమె భర్త చంద్రన్న లొంగిపోయారు. మోతీబాయి అంత్యక్రియలు మంగళవారం పిప్పల్దరి గ్రామంలో జరగనున్నాయి.
- Advertisement -



